హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంత రూపంలో వీరభద్రస్వామి దర్శనం

KDP: రాయచోటిలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం పురాతనమైన, విశిష్ట ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా ఉగ్రరూపంలో దర్శనమిచ్చే వీరభద్రస్వామి ఇక్కడ ప్రశాంతమైన జ్ఞానప్రదాత రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. మూడు ప్రధాన గోపురాలతో అలరారే ఆలయంలో భద్రకాళీ అమ్మవారితో పాటు వినాయకుడు, శివుడు, సుబ్రహ్మణ్యస్వామి, కాలభైరవులకు ప్రత్యేక ఉపాలయాలు ఉన్నాయి.