హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిశ్రమ నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి?

MBNR: జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని సుప్రీమ్ పరిశ్రమలో శుక్రవారం ఉదయం మాచారం గ్రామానికి చెందిన చందు అనే కాంట్రాక్టర్‌కు ఫిట్స్ వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. కార్మికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. అత్యవసర సమయంలో పరిశ్రమ యాజమాన్యం అంబులెన్స్ ఏర్పాటు చేయలేదని సకాలంలో స్పందించక పోవడమే మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.