KNR: ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పెన్షన్ డబ్బులు గురువారం లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి. ఈ సందర్భంగా గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్లు మంజూరు కావడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
చేయూత పెన్షన్ జమ.. లబ్ధిదారుల హర్షం


