HYD: పాతబస్తీలో దారుణ హత్య చోటుచేసుకుంది. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అబుబకర్ కాలనీలో అబ్దుల్ రహీంను గుర్తుతెలియని వ్యక్తి సుత్తితో తలపై బలంగా కొట్టి హతమార్చాడు. ఇంట్లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తూ దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
పాతబస్తీలో దారుణ హత్య


