హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించాలి: దేవిదాస్

ADB: నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్‌లో సీనియర్ సిటిజన్ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సంఘం జిల్లాధ్యక్షుడు దేవిదాస్ దేశ్‌పాండే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.