హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు రాజాపూర్ విద్యార్థిని

మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా అండర్‌-17 బాలికల ఫుట్‌బాల్ ఎంపిక పోటీల్లో రాజాపూర్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని పీ.హారిక ప్రతిభ కనబరిచింది. జిల్లా క్రీడా అధికారుల ప్రశంసలు అందుకున్న ఆమె, రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుంది.