హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ గెలిచిన కాంగ్రెస్ మద్దతుదారుడు

ELR: టీ.నర్సాపురం మండలం తిరుమల దేవి పేట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సాధనాలు నరసింహారావు విజయం సాధించారు. ప్రత్యర్థి కూటమి బలపరిచిన పెండ్యాల రాజేంద్రప్రసాద్‌పై 736 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మండలంలో అత్యధిక ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకైక సర్పంచ్‌గా నరసింహారావు నిలిచారు. ఈ ఫలితాలు ఆలస్యంగా రావడంతో ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూశారు.