హైదరాబాద్: 28°C
తెలంగాణ

VKB: ఖానాపూర్ లో మూలకు చేరిన పంచాయతీ ట్రాక్టర్

VKB: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రభుత్వం అందించిన పంచాయతీ వాహనాలు నిరుపయోగంగా మారాయి. మండలంలోని ఖానాపూర్‌లో ట్రాక్టర్, ట్రాలీని వినియోగించకుండా పక్కన పెట్టడంతో తుప్పు పడుతున్నాయి. మరోవైపు ప్రైవేటు ట్రాక్టర్లను అద్దెకు తీసుకుంటూ పంచాయతీ నిధులు ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.