BDK: ఈనెల 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. పినపాక నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలని, గ్రామస్థాయి నాయకులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కోరారు. కార్యక్రమం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
దీక్షా దివస్‌కు భారీగా తరలిరావాలి: రేగా కాంతారావు


