హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కమిషనర్ ఆదేశాల మేరకు కుక్కలు పట్టివేత..!

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదేశాల మేరకు వీధుల్లో సంచరించే పశువులు, శునకాలు, ప్రజలకు ఇబ్బంది కలిగించే జంతువులను నియంత్రించే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగా ప్రజలనుంచి అందుకున్న ఫిర్యాదుల మేరకు శుక్రవారం స్థానిక ఆకుతోట, ధనలక్ష్మీ పురం, గుండ్ల పాలెం, చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతాలలో 22 శునకాలను పట్టారు.