మహబూబ్నగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మైత్రిప్రియ తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ అర్హత కలిగి 18-30 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు. విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్, బయోడేటాతో పిల్లలమర్రి రోడ్డులోని జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో హాజరుకావాలన్నారు.
తెలంగాణ
రేపు జాబ్ మేళా


