హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీ నుంచి ఇనుప కట్ట పడి విద్యార్థిని దుర్మరణం

AKP: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాలేజీకి వెళ్లేందుకు తండ్రితో కలిసి వేచి ఉన్న విద్యార్థిని నాగసాయిలక్ష్మిపై, ఐరన్ బండిళ్లతో వెళ్తున్న లారీ నుంచి ఇనుప కట్ట పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఆమె తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి.