హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాలు మార్పు

AKP: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోటవురట్ల మండలంలో కైలాసపట్నం, తంగేడులో పోలింగ్ కేంద్రాలు మార్పు చేసినట్లు రిటర్నింగ్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. కైలాసపట్నం ఎంపీపీ స్కూల్లో ఇప్పటివరకు నిర్వహించిన పోలింగ్ కేంద్రాలను స్థానిక సచివాలయం, కమ్యూనిటీ హాల్, రైతు సేవా కేంద్రం ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.