హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రీపోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఏ.ఎస్పీ

PLD: జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాల మేరకు బొల్లాపల్లి (మం) గరికపాడు పంచాయతీ రీపోలింగ్ కేంద్రాలను అదనపు ఎస్పీ (ఏఆర్) ఎల్. శేషాద్రి సందర్శించారు. పోలీసు బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు, నాయకులు సహకరించాలని కోరారు.