GNTR: తెనాలిలో పెరుగుతున్న దోమలు, పారిశుధ్య సమస్యలపై పట్టణ, పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సైడ్ కాలువలు, కల్వర్టుల కింద పూడిక తొలగించక మురుగునీరు నిలిచిపోతోందని, ముఖ్యంగా దేవిచౌక్ వద్ద సమస్య తీవ్రంగా ఉందని పేర్కొంది. నూతన మున్సిపల్ ఛైర్పర్సన్, కౌన్సిలర్లు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రతిరోజూ పూడిక తొలగింపు పనులు చేపట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పారిశుధ్యంపై అభివృద్ధి సంఘం ఆందోళన


