హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈవీఎం గిడ్డంగి వద్ద నిరంతర నిఘా ఉండాలి'

పార్వతీపురంలో ఈవీఎం, వీవీప్యాట్ భద్రతా గిడ్డంగిని మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు, గోడౌన్ సీల్స్‌ను పరిశీలించారు. భద్రతా సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.