హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 114 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీశాఖ తనిఖీలు ముమ్మరం చేసింది. వివిధ ప్రాంతాల్లో 114 దుంగలు స్వాధీనం చేసుకుని, 7 వాహనాలు సీజ్ చేశారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సిద్ధవటం, బద్వేల్, ప్రొద్దుటూరు, వేంపల్లి ప్రాంతాల్లో పట్టుకున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి బాలరాజు తెలిపారు.