హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డాక్టర్ మంగాదేవి భౌతికకాయానికి నగర మేయర్ నివాళి

గుంటూరు విద్యారంగంలో విశేష సేవలందించిన శ్రీ వెంకటేశ్వర బాలకోటి ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నన్నపనేని మంగాదేవి శుక్రవారం చోడవరంలోని చేతన ఫౌండేషన్ ఆవరణలో కన్నుమూశారు. గుంటూరు నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ మంగాదేవి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. డాక్టర్ మంగాదేవి భౌతికకాయాన్ని సందర్శించి, పుష్పాంజలి ఘటించారు.