హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనకదాసు ఆశయాలు సమాజానికి ఆదర్శం: జాయింట్ కలెక్టర్

కోనసీమ: కనకదాసు ఆశయాలు, బోధనలు నేటి సమాజానికి ఆదర్శప్రాయమని జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కనకదాసు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భక్తి, సమానత్వం, సామాజిక చైతన్యం వంటి విలువలను కనకదాసు తన రచనల ద్వారా సమాజానికి చాటిచెప్పారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరించాలని కోరారు.