హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నేతలు దాడి చేశారని వైసీపీ ఆరోపణ

ప్రకాశం: బేస్తవారిపేట మండలం కొత్తపల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడినట్లు వైసీపీ నాయకులు శుక్రవారం ఆరోపించారు. తాము గెలుస్తామనే భయంతోనే దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. పోలీసులు సైతం టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తమ ప్రచార వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆరోపించారు.