హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చర్చనీయాంశంగా మారిన సర్పంచ్ అభ్యర్థి హామీలు

VZM: బొండపల్లి మండలం కెరటం గ్రామ సర్పంచ్‌ అభ్యర్థి శిరీష వినూత్న హామీలతో శుక్రవారం ఎన్నికల బరిలో నిలిచారు. ఆడపిల్ల వివాహానికి రూ.3 వేలు, ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు రూ.5వేలు, ఆడపిల్ల జననానికి రూ.5వేలు ఇస్తానని ప్రకటించారు. సొంత నిధులతో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఈ మినీ మేనిఫెస్టో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.