హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో సీనియర్ జర్నలిస్టుపై దాడి

బాపట్ల ఏ.వీ.వీ. హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద సీనియర్ విలేఖరి రాఘవపై దాడి హేయమైన చర్య అని జై భీమ్ రావ్ భారత పార్టీ జిల్లా అధ్యక్షులు డా. పర్రె కోటయ్య ఖండించారు. తెలంగాణ బీజేపీ నేతలమని చెప్పుకున్న వ్యక్తులతో వివాదంలో ఈ దాడి జరిగిందన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.