హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి సర్పంచ్ అభ్యర్థి ఇంటింటా ప్రచారం

NDL: కొలిమిగుండ్ల (మం) పెట్టికోటలో శుక్రవారం కూటమి పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థి గొంగటి నాగిరెడ్డి ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో మంచం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.