KDP: బద్వేల్ పట్టణంలో పారిశుద్ధ్య పనులపై మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ శుక్రవారం ఉదయం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటి చెత్త సేకరణను పరిశీలించారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని, పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని సిబ్బందిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
బద్వేల్లో పారిశుద్ధ్య పనులపై కమిషనర్ తనిఖీలు


