E.G: సీతానగరం మండలం ముగ్గళ్ళ గ్రామంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా కూటమి పార్టీల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే బత్తుల


