అన్నమయ్య: పుంగనూరు చరిత్రకు ఆనవాలుగా నిలిచిన పుష్కరిణి నిర్వహణ లోపంతో దుస్థితికి చేరుతోంది. పరిమితికి మించి నీటిని నిల్వ చేయడంతో మధ్యలోని గోపురం నీట మునిగి దెబ్బతింటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్తీక మాసంలో దశాబ్దాలుగా నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవానికి పుష్కరిణి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, దీనిని శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నిర్వహణ లోపంతో దెబ్బతింటున్న పుష్కరిణి


