ELR: పెదవేగి నుంచి లక్ష్మీపురం వెళ్లే మార్గంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద రహదారి దెబ్బతిని భారీ గొయ్యి ఏర్పడింది. మలుపు వద్ద గొయ్యి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గొయ్యిలో నీరు నిలిచిపోవడంతో అది కనిపించక ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై గొయ్యి.. వాహనదారులకు ఇక్కట్లు


