హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నారుమడిని తలపిస్తున్న వరి పొలాలు

WG: అర్నబ్, మురసు తుపానులు జిల్లాలో రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఎక్కడ చూసినా నీట మునిగిన వరి చేలు దర్శనమిస్తున్నాయి. మరోవైపు నేలవాలిన వరి కంకులు మొలకెత్తడంతో అన్నదాతలకు కనీసం తిండి గింజలు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. భీమవరం పట్టణ పరిధిలోని తాడేరులో సుమారు మూడు ఎకరాల వరి పంట పూర్తిగా నేలవాలి మొలకెత్తడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.