హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అష్టైశ్వర్య ప్రాప్తికి 11 రోజుల పాటు రుద్రహోమాలు

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఈనెల 27 నుంచి డిసెంబర్ 7 వరకు 11 రోజుల పాటు ఏకాదశ రుద్రహోమ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులకు ఆయురారోగ్యాలు, సుఖసంపదలు, అష్టైశ్వర్యాలు కలగాలనే సంకల్పంతో ఈ హోమాలు నిర్వహిస్తున్నారు. రూ.500 టికెట్‌తో ఇద్దరు గృహస్తులు ఒకరోజు హోమంలో పాల్గొనే అవకాశం కల్పించారు.