హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బౌండ్ ఓవర్ నిబంధనలు మీరితే జైలు శిక్ష: ఎస్పీ

PLD: బౌండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి హెచ్చరించారు. బౌండ్ ఓవర్‌ను ఎవరూ తేలికగా తీసుకోవద్దని, నిబంధనలు మీరితే 3 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. మద్యం సేవించడం, ఆయుధాలు కలిగి ఉండటం, గొడవలకు దిగడం వంటి చర్యలతో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ తెలిపారు.