కృష్ణా: రామవరప్పాడు గ్రామ పంచాయతీ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. సర్పంచ్ అభ్యర్థి కొల్లా ఆనంద్ 2,200 పైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో ప్రత్యర్థి రత్నం నాగేశ్వరరావుపై ఘన విజయం సాధించారు. తెల్లవారుజామున 4 గంటల వరకు ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగింది. తుది ఫలితం వెలువడిన అనంతరం కొల్లా ఆనంద్ రిటర్నింగ్ అధికారిణి నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
రాత్రంతా కౌంటింగ్.. తెల్లవారుజామున ప్రకటన


