అనంతపురం నగరంలో పారిశుద్ధ్యంపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం ఉదయం ఆర్ట్స్ కళాశాల ఎదుట రోడ్డుపై చెత్త వేస్తున్న వారిని గుర్తించిన ఎంహెచ్ రాజేంద్రనాథ్ చౌదరి.. వారితోనే చెత్తను తీయించి చెత్తబుట్టలో వేయించారు. రోడ్లపై చెత్త వేస్తే చర్యలు తప్పవనే సంకేతమిచ్చారు. ఈ తరహా చర్య నగరంలో తొలిసారిగా చేపట్టడంపై హర్షం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై చెత్త వేసిన వారితోనే తొలగింపు


