HYD: నగరంలో గురువారం రాత్రి కురిసిన వర్షంతో దాదాపు నెల రోజుల పొడి వాతావరణానికి తెరపడింది. గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 8.30 వరకు కూకట్పల్లి వివేకానంద నగర్లో అత్యధికంగా 79.3 మి.మీ, సఫిల్‌గూడలో 75.3, షేక్‌పేటలో 68.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. మేఘాలు తొలగడంతో రాబోయే 48 గంటల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గి, వారాంతం చలి పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ
నగరంలో వర్షం.. నెల పొడిగాలులకు తెర!


