హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి వృథా.. ఇద్దరికి జరిమానా!

RR: ఆదిభట్ల సర్కిల్ తుర్కయాంజాల్ డివిజన్‌లో నీటి వృథాకు పాల్పడిన ఇద్దరికి జలమండలి అధికారులు జరిమానా విధించారు. జంగారెడ్డి కాలనీకి చెందిన ఓ మహిళకు రూ. 1,000, సాగర్ మాతా శుద్ధినీటి కేంద్రం నిర్వాహకుడికి రూ. 2వేల జరిమానా విధించిట్లు జలమండలి మేనేజర్ ఎండీ ఆసిఫ్ అలీ తెలిపారు. ఎల్‌నినో నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు.