హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మళ్లీ పెద్దపులి జాడ..!

NTR: కనుమూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి కదలికలకు సంబంధించి మూడు రోజుల తర్వాత ట్రాకర్ ద్వారా తిరిగి సంకేతాలు అందాయి. దీంతో ఏడో రోజుకు చేరిన టైగర్ ఎక్స్‌ప్లోరర్ ఆపరేషన్‌లో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత అర్ధరాత్రి పులి కనుమూరు ఫారెస్ట్‌లోనే సంచరించినట్లు గుర్తించారు. పులి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది.