హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వారెడ్డిపల్లిలో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం

NGKL: వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి గ్రామ శివారులోని వంగూరు-సర్వారెడ్డిపల్లి రహదారి పక్కన, పంట పొలాల్లో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా వంగి ఉంది. దీనివల్ల కరంటు సరఫరాకు అంతరాయం కలిగి మోటార్లు చెడిపోయే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దారిలో వెళ్లాలంటే భయపడుతున్నామని, విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి స్తంభాన్ని ఆధునికరించాలని కోరుతున్నారు.