NZB: నవీపేట్ గ్రామంలోని బాసర నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే గేట్ గత నాలుగు రోజులుగా మరమ్మతుల కారణంగా మూసివేశారు. శుక్రవారం మరమ్మతు పనులు పూర్తవడంతో రైల్వే గేట్‌ను తిరిగి ప్రారంభించారు. దీంతో వాహనాల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. గేట్ తెరుచుకోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
నాలుగు రోజుల తర్వాత తెరుచుకున్న రైల్వే గేట్


