హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేయూ స్నాతకోత్సవానికి గవర్నర్ పర్యటన ఖరారు

WGL: కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈనెల 28న నిర్వహించే 24వ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన ఖరారైంది. ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు చేరుకుని, 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు స్నాతకోత్సవంలో పాల్గొంటారు. విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్, పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేస్తారు. మధ్యాహ్నం 2.05 తిరుగు ప్రయాణం అవుతారు.