హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం

RR: పెద్దజానంపేట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు సందర్భంగా శుక్రవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, పుష్పయాగం, అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నర్సింహులు కోరారు.