హైదరాబాద్: 28°C
తెలంగాణ

మనిగిల్లలో అభివృద్ధి పనులకు శ్రీకారం

WNP: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మూగజీవులు, పక్షుల దాహార్తి తీర్చేందుకు చెన్నకేశవ స్వామి ఆలయం, వాటర్ ట్యాంక్, బస్టాండ్ వద్ద నీటి తొట్టెలు నిర్మించారు. ఉపాధి హామీ కూలీలతో చౌట చెరువు కట్టపై కంపచెట్లను తొలగించడంతో పాటు, జేసీబీతో స్మశాన వాటికను శుభ్రం చేయించారు.