హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తకోటలో 29న ఘనంగా సదర్ ఉత్సవాలు

WNP: కొత్తకోట మండలంలో తొలిసారిగా ఈనెల 29న సదర్ ఉత్సవాలను నిర్వహించేందుకు శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక శ్రీకృష్ణ దేవాలయంలో జరిగే ఈ వేడుకలు యాదవుల ఐక్యత, ఆత్మగౌరవం, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలవనున్నాయి. యాదవ సోదర సోదరీమణులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.