హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో టీడీపీకి వైసీపీ గట్టి పోటీ

సత్యసాయి: జిల్లాలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యం సాధించింది. అయితే వైసీపీ గట్టి పోటీ ఇచ్చి తన సత్తా చాటింది. జిల్లాలో మొత్తం 113 స్థానాలకు గాను టీడీపీ 58 స్థానాల్లో, వైసీపీ 50 స్థానాల్లో విజయం సాధించాయి. ఇతరులు ఐదు స్థానాలను కైవసం చేసుకున్నారు. స్వల్ప ఆధిక్యంతో టీడీపీ విజయం సాధించగా, వైసీపీ పోటీ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.