హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కొరడా

NLG: మిర్యాలగూడ రూరల్ మండలం యాదగిరిపల్లి శివారులో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఈరోజు తెల్లవారుజామున సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు ట్రాక్టర్ల యజమానులపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఉప్పు నగేష్ హెచ్చరించారు.