BHNG: చౌటుప్పల్ ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్ల జాప్యం రైతుల పాలిట శాపంగా మారింది. గత రెండు నెలలుగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో అన్నదాతలు కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో నాణ్యత తగ్గి గిట్టుబాటు ధర రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే కొనుగోళ్లు చేపట్టి, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. వర్షానికి తడిసిన పంట


