భూపాలపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులను కొందరు అధికారులు వ్యక్తిగత పనులకు వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్, వంట పనులకు సిబ్బందిని ఉపయోగిస్తున్నట్లు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
మున్సిపాలిటీలో సిబ్బంది దుర్వినియోగంపై ఫిర్యాదు


