హైదరాబాద్: 28°C
తెలంగాణ

SI పరీక్షల నేపథ్యంలో వాకర్స్‌కు ఆంక్షలు

WGL: ఈ నెల 29న వరంగల్ ట్రై సిటీ పరిధిలో 32 కేంద్రాల్లో SI ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 6 పరీక్షా కేంద్రాల మైదానాల్లో వాకింగ్‌కు తాత్కాలికంగా అనుమతి రద్దు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతా శుక్రవారం తెలిపారు. ఈ నెల 28న సాయంత్రం 6 గంటల నుంచి 29న పరీక్ష ముగిసే వరకు వాకర్స్ ఆయా మైదానాలకు రావద్దన్నారు. పోలీసులకు సహకరించాలని కోరారు.