PLD: రొంపిచర్ల మండలం అన్నవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కందిమళ్ల శ్రీనివాసరావు సతీమణి వెంకాయమ్మ 149 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని వెంకాయమ్మ పేర్కొనగా గ్రామస్తులు అభినందనలు తెలిపారు. గ్రామంలో సంబరాలు మిన్నంటాయి.
ఆంధ్రప్రదేశ్
అన్నవరంలో కందిమళ్ల వెంకాయమ్మ ఘన విజయం


