హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్య వివాహ రహిత జిల్లాకు ప్రతిజ్ఞ

SRCL: బాల్య వివాహాల నివారణపై సిరిసిల్ల కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు జరిగింది. కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ, 18 ఏళ్లలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు బాలురకు పెళ్లి చేయరాదన్నారు. ఎస్పీ మహేశ్ బి. గీతే బాల్య వివాహాల సమాచారాన్ని 1098కు ఇవ్వాలని, రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా ఉంటుందని హెచ్చరించారు. గత ఏడాది 12 బాల్య వివాహాలను అడ్డుకున్నామని అధికారులు తెలిపారు.