NLG: జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్ద జలాశయంగా ఉన్న మూసీ ప్రాజెక్టు అతిథి గృహం నిర్వహణ లేక ఆనవాలు కోల్పోతుంది. దశాబ్ద కాలం నుంచి దీని నిర్వహణను పట్టించుకోకపోవడంతో క్రమక్రమంగా శిథిలమవుతోంది. దీని నిర్వహణ సిబ్బంది పదేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందడంతో తిరిగి కొత్త నియామకాలు చేయక నిర్వహణ కొరవడింది. సంబంధిత అధికారులు స్పందించి అతిథిగృహం నిర్వహణపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
శిథిలావస్థలో మూసీ ప్రాజెక్ట్ అతిథి గృహం


