హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పిన ప్రమాదం

RR: షాద్‌నగర్ పట్టణంలోని బాలాజీ టౌన్‌షిప్ ఎదురుగా ఓల్డ్ హైవేపై ఇవాళ ఉదయం 8 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన కార్మికులను ఎక్కించుకుంటున్న ఎంఎస్ఎన్ కంపెనీ బస్సును ఓ లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో బస్సు వెనుక భాగం నుజ్జునుజ్జు కాగా, పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.